Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

నెహెమ్యా 11

Neh 11:1  జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూష లేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి. 
Neh 11:2  యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పు కొనినవారిని జనులు దీవించిరి. 
Neh 11:3  యెరూష లేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివ సించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజ కులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి. 
Neh 11:4  మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. 
Neh 11:5  మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను. 
Neh 11:6  యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు. 
Neh 11:7  బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. 
Neh 11:8  అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు; 
Neh 11:9  జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియై యుండెను. 
Neh 11:10  యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును 
Neh 11:11  శెరాయా దేవుని మందిరమునకు అధిపతియై యుండెను. ఇతడు మషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీ యాకు పుట్టెను. 
Neh 11:12  ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అవీ్జు పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా. 
Neh 11:13  పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి. 
Neh 11:14  బల వంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. 
Neh 11:15  లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీకాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు. 
Neh 11:16  లేవీయు లలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి. 
Neh 11:17  ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతని చేతిక్రింది వారు 
Neh 11:18  పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు. 
Neh 11:19  ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు. 
Neh 11:20  ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. 
Neh 11:21  నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. 
Neh 11:22  యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు 
Neh 11:23  వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను. 
Neh 11:24  మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. 
Neh 11:25  వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను 
Neh 11:26  యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను. 
Neh 11:27  హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను 
Neh 11:28  సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను 
Neh 11:29  ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను 
Neh 11:30  జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివ సించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి. 
Neh 11:31  గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను 
Neh 11:32  అనాతోతులోను నోబులోను అనన్యాలోను 
Neh 11:33  హాసోరులోను రామాలోను గిత్తయీములోను 
Neh 11:34  హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను 
Neh 11:35  లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. 
Neh 11:36  మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి. 

No comments:

Post a Comment