Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, September 26, 2013

నెహెమ్యా 6

Neh 6:1  నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టి యుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని 
Neh 6:2  సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించిఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి. 
Neh 6:3  అందుకు నేనునేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొ ద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. 
Neh 6:4  వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆ ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని. 
Neh 6:5  అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను. 
Neh 6:6  అందులోవారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, 
Neh 6:7  యూదు లకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించి తివనియు మొదలగు మాటలునురాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నా డనియు వ్రాయబడెను. 
Neh 6:8  ఈ పని చేయలేకుండ మే మశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరి గాని 
Neh 6:9  నేనుఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్త మానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. 
Neh 6:10  అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడురాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా 
Neh 6:11  నేనునావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. 
Neh 6:12  అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని 
Neh 6:13  ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపు నట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి. 
Neh 6:14  నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసికొనుము. 
Neh 6:15  ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువది యయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 
Neh 6:16  అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజను లందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి. 
Neh 6:17  ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను. 
Neh 6:18  అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియు గాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారు డైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి. 
Neh 6:19  వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు ఆతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబీయా పత్రికలు పంపెను. 

No comments:

Post a Comment